పవన్‌ను కలిసిన ఆషు.. నాలుగో పెళ్లికి సైతం సిద్ధమేనట..
- IndiaGlitz, [Tuesday,March 02 2021]
‘బిగ్‌బాస్’ ఫేమ్‌లు వరుసగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలుస్తున్నారు. ఇటీవల బిగ్‌బాస్ ఫేమ్ హిమజ.. పవన్‌ని కలిసి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తాజాగా మరో బిగ్‌బాస్ ఫేమ్ ఆషురెడ్డి.. పవన్‌ని కలిసింది. తన దేవుడిని మళ్లీ కలుసుకున్నానంటూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. పవన్ దిగిన ఫోటోతో పాటు .. ఆయన తనకు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసి సంబరపడిపోతోంది ఆషు. గతంలో కూడా ఒకసారి పవన్‌ను ఆషు కలిసింది.
‘‘నా దేవుడు పవన్ కల్యాణ్‌ని మళ్లీ కలుసుకున్నాను. అతను నన్ను నా పచ్చబొట్టును జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు టీ ఆఫర్ చేశారు. రెండు గంటలు నాతో సంభాషించారు. ఈ అనుభూతి చాలా స్వీట్‌గా అనిపించింది. చాలా ఆనందంగా ఉన్నాను. వచ్చేసేటప్పుడు ఆయన నాకు స్వీట్ లెటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నా ఫస్ట్ లవ్’’ అంటూ పోస్టు పెట్టి ఆషు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ పోస్టుతో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసింది.
ఆషు పోస్టుపై నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. రకరకాల ప్రశ్నలడుగుతూ తన అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘ఒకవేళ పవన్ కళ్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా’? అని ప్రశ్నించాడు. దీనికి ఆషు ‘ఓ ఎస్’ అని రిప్లై ఇచ్చింది. గతంలో ఆషు తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కళ్యాణ్ పేరును పచ్చబొట్టు పొడుపించుకుని హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాజాగా పవన్‌ని కలిసిన సందర్భంలో ఆయన తన టాటూ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించారని ఆషు వెల్లడించింది.