KP Chowdary:టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న కేపీ చౌదరి వ్యవహారం : తెరపైకి అషురెడ్డి, సురేఖా వాణి పేర్లు.. కాల్ డేటాతో వెలుగులోకి

  • IndiaGlitz, [Saturday,June 24 2023]

డ్రగ్స్‌ కేసులో కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి) అరెస్ట్‌తో టాలీవుడ్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఇతనితో ఎవరెవరికి లింకులు వున్నాయి.. ఇతని కస్టమర్లు ఎవరు..? ఇప్పటి వరకు అతని నుంచి డ్రగ్స్ ఎవరు కొనుగోలు చేశారు ..? వంటి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా కేపీ చౌదరి వాట్సాప్ చాట్, కాల్ డేటా‌లు అత్యంత కీలకంగా మారాయి. వాటిని విశ్లేషిస్తూ పోతుంటే నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కేపీ చౌదరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును అనుమతి కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరించింది. ఈ సందర్భంగా కేపీ చౌదరి కస్టడి రిపోర్టులో సంచలన విషయాలను పోలీసులు ప్రస్తావించారు.

కేపీ కస్టమర్‌లలో ఎక్కువ మంది సినీ ప్రముఖులే :

సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించాడు. వీరిలో ఎక్కువగా చిత్ర పరిశ్రమకు చెందిన వారే వుండటంతో టాలీవుడ్‌లో కలకలం రేపింది. ఆషురెడ్డి, సురేఖావాణి, జ్యోతి తదితరులతో కేపీ చౌదరి వందలాది కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. వీరితో కలిసి పార్టీలకు హాజరుకావడం, ఫోటోలు దిగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నటి సురేఖ వాణి , అషురెడ్డిలతో అతనికి సన్నిహిత సంబంధాలు వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నింటిలోకి సురేఖావాణితో కేపీ క్లోజ్‌గా వున్న ఫోటోటు వైరల్ అవుతున్నాయి. ఓ పార్కింగ్ ఏరియాలో కేపీ చౌదరిని ముద్దాడుతూ.. సురేఖా వాణి ముద్దాడుతూ కనిపించింది.

అషురెడ్డికి ఈ స్థాయిలో లగ్జరీ లైఫ్ ఎలా సాధ్యం :

ఇక బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి వ్యవహారం కూడా చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. అడపాదడపా వెబ్ సిరీస్‌లు , ఏవో కొన్ని షోలు చేసుకుంటూ ఆమె గడిపిస్తోంది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపయినప్పటికీ .. అషురెడ్డి లగ్జరీగానే గడుపుతూ వుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేపీతో సన్నిహిత సంబంధాల వల్లే ఆమె ఈ స్థాయిలో వుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిజానిజాలు వెలికి తీయాలని పోలీసులు భావిస్తున్నారు. అవసరమైతే వీరందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కేపీ వ్యవహారం టాలీవుడ్‌కి డ్రగ్స్‌కి వున్న బంధాన్ని బయటపెట్టింది. పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా, గట్టి నిఘా పెడుతున్నా.. ఇండస్ట్రీలోని కొందరి చేతికి డ్రగ్స్ చేరుతున్నట్లు కేపీ వ్యవహారం బయటపెట్టింది.

More News

YV Subba Reddy:శ్రీవాణి ట్రస్ట్‌పై పవన్ ఆరోపణలు .. ఇవిగో లెక్కలు : శ్వేతపత్రం విడుదల చేసిన వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan:ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇన్ని ఘోరాలా.. జనసేన వస్తే సుభిక్ష ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mudragada Padmanabham:నేను నీ బానిసను కాను.. కాకినా, పిఠాపురంలో పోటీకి సిద్ధమా : ఈసారి పవన్‌పై రెచ్చిపోయిన ముద్రగడ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా మరో లేఖ సంధించారు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.

గంజాయికి ఏపీని హబ్‌గా మార్చారు.. అడ్డుకున్నారనే కక్షతో గౌతం సవాంగ్‌పై వేటు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో

Janasena Chief Pawan:మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు.. ఆయనేం చేగువేరా, కొండపల్లి, పుచ్చలపల్లి కాదు : జగన్‌పై పవన్ ఆగ్రహం

నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోసం చేశాడని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.