ఆహా లో 'అశోక వనంలో అర్జున కళ్యాణం' ... ఎప్పటి నుంచంటే ... ?
Send us your feedback to audioarticles@vaarta.com
100 % లోకల్ వినోదం అంటే ఆహా. అలా తనకి తానే ప్రేక్షకులకి అభిరుచులకు తగ్గట్టుగా మార్చుకుంటున్న మన ఓ టి టి ప్లాట్ ఫాం ఈసారి ఒక మంచి ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా తో అందరిని అలరించబోతుంది. మండుతున్న ఎండలో చల్లగా అందరిని నవ్వించడానికి జూన్ 3న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాని ఆహా మనముందుకు తీసుకొనివస్తుంది.
పెళ్లెప్పుడు చేసుకుంటావ్ రా అబ్బాయ్.. 30 ఏళ్లు పైబడ్డాయ్ పప్పన్నం పెట్టవా?.. పైన జుట్టు ఊడుపోతుంది.. కింద పొట్టపెరిగిపోతుంది.. ఇంకెప్పుడు పెళ్లి..? ఇలాంటి ప్రశ్నలు 30 ఏళ్లు దాటిన ప్రతి యువతీయువకులకు ఎదురవుతూనే ఉంటాయి. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పక్కింటోడు అడిగాడనా?.. లేదంటే వయసు అయిపోతుందనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా.
తెలంగాణ లోని సూర్యాపేట లో వడ్డీ వ్యాపారం చేసే అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్)కి తన కులంలో సంబంధాలు దొరక్కపోవడంతో కులాంతర వివాహానికి రెడీ అవుతాడు. ఆంధ్రా అమ్మాయి మాధవి (రుక్సార్ ధిల్లాన్)తో పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు. ఎంగేజ్‌మెంట్ కోసం బంధుమిత్రులతో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తాడు. అయితే సరిగ్గా అదే టైంకి లాక్ డౌన్ ప్రకటించడంతో పెళ్లి వాళ్ల ఇంట్లో లాక్ అయిపోతారు. సరిగ్గా పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న టైంలో పెళ్లి కూతురు జంప్ అవుతుంది. మాధవి అర్జున్ కుమార్‌ని వదిలి ఎందుకు లేచిపోతుంది.. అసలు అర్జున్ పెళ్లి ఎవరితో జరుగుతుంది ? ఎప్పుడు అవుతుంది.. అని తెలుసుకోవాలంటే జూన్ 3 నుండి ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా చూడాల్సిందే.
Trailer Link - https://www.youtube.com/watch?v=vTxWfSx1iLU
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments