సేఫ్ జోన్ లో ఉండాలని హర్రర్ మూవీ చేశాను - అశోక్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
రీడింగ్ లాంప్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆశిష్ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతి మోల్, మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. అశోక్ రెడ్డి దర్శక నిర్మాత. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ...
నేపథ్యం....
మాది గుంటూరు జిల్లాలోని అంబాపురం గ్రామం. నేను ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకున్నాను. ఆ తర్వాత బెంగుళూరులో పి.డబ్ల్యు.సిలో ఉద్యోగం చేశాను. అక్కడు వర్క్ చేస్తున్నప్పుడే రెండు షార్ట్ ఫిలిమ్స్ కూడా డైరెక్ట్ చేశాను. అందులో త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అనేది ఓ షార్ట్ ఫిలిమ్ ఒకటి, అలాగే జైనీ అనేది మరో షార్ట్ ఫిలిమ్. ఆ రెండు సినిమాలతో నాకు ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ బాగా వచ్చింది. హారర్ అయితే సేఫ్ జోన్లో ఉంటుందని ఈ జోనర్లో సినిమాను చేశాం.
1980 బ్యాక్ డ్రాప్...
1980 బ్యాక్‌డ్రాప్‌లోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. హైదరాబాద్ పరిసరాల్లోనూ, హార్స్లీ హిల్స్ లోనూ ఎక్కువ భాగాన్ని చిత్రీకరించాం.
ఈ జనరేషన్ కు చెప్పాలనుకున్నాను...
చిన్నప్పటి నుంచి మా ఇంటి గోడలపై `ఓ స్త్రీ రేపు రా` అనే లైన్ రాసి ఉండటాన్ని గమనించాను. దాని అర్థం ఏమిటో అని చాలా మందిని అడిగి తెలుసుకున్నాను. ఇప్పటి జనరేషన్‌కి ఆ విషయాలను చెప్పాలనే `ఓ స్త్రీ రేపు రా` అనే సినిమాను తీశాను.
దెయ్యం వెర్షన్ లో మూవీ...
ఈ సినిమా దెయ్యం వెర్షన్ లోనే స్టార్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే దెయ్యం చెప్పే కథ ఇది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మా యూనిట్లో కొంతమందికి దెయ్యాలు కనిపించాయని చెప్పారు.
గ్రాఫిక్స్ వాడలేదు...
70 ప్లస్ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. గ్రాఫిక్స్ వాడలేదు. ప్రవీణ్ ఈ సినిమాకు చాలా సాయం చేశారు. పిజ్జా సినిమా చూసి స్ఫూర్తి పొంది ఈ సినిమాను చేశాను.
నెక్ట్స్ సినిమా...
-నా తదుపరి సినిమాను మరో బ్యాక్ డ్రాప్ లో అనుకుని కథను సిద్ధం చేసుకున్నాను. త్వరలోనే ఆవివరాలను తెలియజేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout