గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశావర్కర్ ఆదివారం మృతి చెందారు. గుంటూరుకు చెందిన విజయలక్ష్మి అనే ఆశా వర్కర్ ఈ నెల 19న కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ నెల 21న ఆమెకు తొలుత కళ్లు తిరిగాయి. అనంతరం విజయలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జీజీహెచ్‌కు తరలించి వైద్యులు చికిత్సను అందించారు. కాగా.. శనివారం విజయలక్ష్మిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యాస్మిన్ పరామర్శించారు. ఈ రోజు విజయలక్ష్మి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. విజయలక్ష్మి తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశా వర్కర్‌గా పని చేస్తున్నారు.
కాగా.. విజయలక్ష్మి మృతితో భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఒకరు, కర్ణాటకకు చెందిన మరొకరు మృతి చెందిన విషయం తెలిసిందే. గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఈ విషాదం వెలుగు చూసింది. వార్డు బాయ్ మహిపాల్ సింగ్ సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' తీసుకున్న తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఛాతీనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే మహిపాల్ సింగ్ మృతి చెందాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments