పౌరసత్వ బిల్లు: మరణం వస్తే మీకంటే ముందు నేనే..!
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో ప్రతి ఒక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపీ పిలుపునిచ్చారు. పౌరసత్వ బిల్లుపై దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నగరంలోని దారుస్సలాంలో రెండోరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ముస్లిం సోదరులకు పలు సలహాలు సూచనలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
నష్టమే తప్ప లాభమేం లేదు!
‘దేశంలోని ప్రజల మధ్యలో గాంధీ లేడు.. కానీ గాంధీ జ్ఞాపకాలు ఉన్నాయి.
అంబేద్కర్ లేడు కానీ ఆయన రాజ్యాంగం మనలో ఉంది. దేశంలో ఉన్న ప్రతి ఇంటి పై జాతీయ జెండాను మోదీ, అమిత్ షా చూడాలి.
ఇప్పుడు హిందూ- ముస్లిమ్, బీజేపీ- ఎంఐఎం మధ్య గొడవ కాదు.
దేశానికి ప్రజలకు మధ్య. దేశాన్ని రక్షించాల్సిన భాద్యత ప్రజలందరిపై ఉంది.
అమిత్ షా చరిత్ర ఎలాంటిదో అందరికీ తెలుసు. బీజేపీ- ఆరెస్సెస్- ముస్లిమ్‌లను మాత్రమే ప్రశ్నించినట్లు కాదు.
గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాంని అవమానించినట్లే. ఇది నా దేశం. దేశం కోసం నా ప్రాణాలు అయినా ఇస్తాను. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్గానిస్తాన్‌తో నాకేమి సంబంధం.
అస్సాంలో ఎంతో మందిపై బులెట్స్ కురిపిస్తున్నారు.. గన్స్‌లో బులెట్స్ ఖాళీ అవుతాయి కానీ మేము పోరాటం ఆపే ప్రసక్తే లేదు.
దేశంలో స్వాతంత్వం వచ్చిన 70 ఏళ్ల తరువాత నేను భారతీయుణ్ణి అని నిరూపించుకోవలో ఎన్ఆర్సీ వల్ల దేశంలో ప్రతి ఒక్కరూ లైన్0లో నిల్చోవాలి.
దేశంలో కేవలం 4శాతం పాస్‌పోర్ట్ ఉన్న ప్రజలు ఉన్నారు. దేశంలో ఉన్న ముస్లిం పేరు ఎన్ఆర్సీలో లేకపోతే అతను అతని కుటుంబం ఎక్కడికి వెళ్లాలి..?.
ఎన్ఆర్సీ వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇలానే చేస్తే రాష్ట్రాలకు రాష్ట్రాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది’ అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
నేను బతికున్నంతవరకూ..!
‘దేశంలో ప్రజలను బీజేపీ రెచ్చకొడుతోంది. ప్రజలు, ముసల్మాన్‌లు ఎవ్వరూ దాడులకు పాల్పడవద్దు.
నేను ఉన్నంత వరకూ ఒక్క ముసల్మాన్‌కు అన్యాయం జరగనివ్వను. యూపీలో ఒక్క రోజులో 12 మంది మరణించారు..
చిన్న చిన్న పిల్లలు మరణించారు. నేను యువత భవిష్యత్ కోసం పోరాటం చేస్తాను. మరణం వరకు వస్తే ముందు నేను ప్రాణాలను వదులుతాను.
మనకు ఆదర్శం గాంధీ, అంబేద్కర్ ఉన్నారు..
శాంతియుతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం.
ముస్లిం సోదరులు ఎవరి ట్రాప్‌లో పడొద్దు.
యూనివర్సిటీ లోపలికి చొచ్చుకుపోయి మరి పోలీసులు విద్యార్థులపై దాడి చేశారు
ఆ విద్యార్థులు దేశంలోని ప్రజలు కదా?.. ఆ స్టూడెంట్స్ అందరూ ఏం చేశారని వాళ్ళను అంత దారుణంగా కొట్టారు.
ఆ స్టూడెంట్స్ దగ్గర ఏమైనా మరణాయుధాలు ఉన్నాయా?.
దేశంలో రాజ్యాంగం బ్రతికించేందుకు మేము పోరాటం చేస్తున్నాము.
రాజ్యాంగంకు చిల్లు పడితే దేశాన్ని ఎవరూ కాపడలేరు.
పోలీస్ తూటాల వల్ల మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని బహిరంగ సభా వేదికగా అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments