అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

అయోధ్య స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద స్థలం హిందువులకు.. ముస్లీంలకు ప్రత్యామ్నాయ స్థలం అని కోర్టు తేల్చేసింది. కొన్ని దశాబ్దాలుగా రగులుతున్న ఈ స్థలం వివాదంపై ఒకే ఒక్క గంటలో సుప్రీం తేల్చేసింది. అయితే ఈ తీర్పుపై హిందువులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. చాలా వరకు ముస్లింలు కూడా ఈ తీర్పును స్వాగతించారు కూడా. మరికొందరు నేతలు ఈ తీర్పును తీవ్రంగా తప్పుబడుతున్నారు. సుప్రీం తీర్పుపై మేం సంతృప్తిగా లేము. సుప్రీంకోర్టు సుప్రీమే కానీ, అమోఘం కాదు. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ఆఫర్‌ను తిరస్కరించాలి. ‘ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదు’ అని ఈ సందర్భంగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, లీగల్ హక్కుల కోసం తాము పోరాడతామన్నారు. వాస్తవాల మీద విశ్వాసాలే గెలిచాయని.. తీర్పును సవాలు చేసే విషయంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై తాను సంతృప్తి లేదన్నారు.

పిటిషన్ వెయ్యలా? వద్దా?

‘సుప్రీంకోర్టు తీర్పు తుది నిర్ణయంపై న్యాయమైన హక్కుకోసం పోరాటం చేస్తున్నాము. మేము ఎవ్వరి దగ్గర భిక్ష కోసం పోరాటం కాదు. 5 ఎకరాల భూమి కేటాయింపు రిజెక్ట్ చెయ్యాలి. వేరే చోట మసిద్ మేము కట్టుకోగలము. నా వ్యక్తిగతంగా నేను సుప్రీంకోర్టు తీర్పుపై సంతృపిగా లేను. 5వందల సంవత్సరాల మసిద్ చరిత్ర ఉంది. ఎంఐఎం సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ కానీ ఇంఫాయిలబుల్‌గా ఉంది. అల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ మీటింగ్ నిర్వహిస్తాము. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వెయ్యలా? వద్దా? అని మీటింగ్ అనంతరం తెలియజేస్తాం. శాంతి భద్రతలను, ఎవ్వరిని రెచ్చగొట్టడానికి నేను మాట్లాడటం లేదు’ అని అసద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఎవ్వరికి బయపడొద్దు.. !

‘సుప్రీంకోర్టు పై నాకు అపారమైన గౌరవం ఉంది భవిష్యత్‌లో ఉంటుంది. మాజీ జస్టిస్ వర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవవిస్తున్నాను. భారత్‌ను హిందుఇజం నుంచి కాపాడాలి. మేము కాంగ్రెస్‌తో ఎందుకు కలుస్తాము?. కాంగ్రెస్, బీజేపీతో కలిసిపోయింది. భారత్ ను రక్షించేందుకు ధర్మం, న్యాయం ఉంది. సంఘ్ పరివార్ రాబోయే రోజుల్లో మసిద్‌లను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ముస్లింలు ఎవ్వరికి బయపడొద్దు.. భయపడి బతకాల్సిన అవసరం మనకు లేదు. న్యాయం కోసం పోరాటం చేద్దాం.. దేవునిపై నమ్మకంతో పోరాటం చేద్దాం’ అని ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు అసదుద్దీన్ పిలుపునిచ్చారు. మొత్తానికి చూస్తే ఇవాళ్టితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందనుకుంటే ముస్లీం నేతలు, సంఘాలు ఇలా రియాక్ట్ అవుతున్నాయి.

More News

ఈ నెల 21న 'జాక్‌పాట్' విడుదల

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్.

అయోధ్యపై సుప్రీం తీర్పు: ఐదెకరాల స్థలం మాకు అక్కర్లేదు!

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి శనివారంతో సుప్రీంకోర్టు ముగింపు పలికిన విషయం విదితమే.

అయోధ్య తీర్పుపై మోదీ, షా రియాక్షన్ ఇదీ...

దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య కేసుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

అయోధ్య తీర్పుపై మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలివీ...

దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే.

'భీష్మ' తొలి వీడియో దృశ్యాలకు మంచి స్పందన

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'.