సూర్య చిత్రంలో విల‌న్‌గా..

  • IndiaGlitz, [Tuesday,January 30 2018]

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన‌ లెజెండ్ చిత్రం సీనియ‌ర్ క‌థానాయ‌కుడు జగ‌ప‌తిబాబు ద‌శ‌, దిశ‌నే మార్చివేసింది. అందులో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించిన ఈ వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌.. ఆ సినిమాతో ఉత్త‌మ విల‌న్‌గా నంది అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. అంతేగాకుండా, త‌మిళ సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్‌కి, అలాగే మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌కి కూడా ఆయ‌న విల‌న్ అయ్యారు.

లింగా చిత్రంలో ర‌జ‌నీని ఢీ కొట్టిన జ‌గ‌ప‌తి.. పులి మురుగ‌న్ (తెలుగులో మ‌న్యం పులి)లో మోహ‌న్ లాల్‌తో ఢీ కొట్టారు. ఇదిలా ఉంటే.. మ‌రో అగ్ర క‌థానాయ‌కుడి సినిమాలో కూడా జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించ‌నున్నా ర‌ని తెలిసింది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. సూర్య‌. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా ఓ త‌మిళ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులోనే సూర్య‌కి విల‌న్‌గా జ‌గ‌ప‌తి న‌టించ‌నున్నార‌ని స‌మాచార‌మ్‌. సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త్వ‌ర‌లోనే జ‌గ‌ప‌తిబాబు ఎంట్రీపై అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది.