రామ్ చరణ్ హీరోయిన్ గా....
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు ధృవ సినిమా పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ధృవ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయనున్నారు. వెంటనే రాంచరణ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ వంటి సెన్సేషనల్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.
ఈ సినిమా స్క్రిప్ట్‌కు సుకుమార్ తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నాను హీరోయిన్‌గా తీసుకోనున్నారట. రీసెంట్‌గా ఆడిషన్‌కు నిర్వహించారని టాక్. ప్రస్తుతం తెలుగులో యంగ్‌హీరోస్ తో జత కడుతున్న రాశిఖన్నాకు ఇది నిజంగా పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com