ఎన్టీఆర్ అల్లుడి పాత్ర‌లో...

  • IndiaGlitz, [Saturday,August 18 2018]

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుంది. జాగర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ ఎన్టీఆర్‌గా న‌టిస్తూ.. సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగ‌ణం సినిమాలో న‌టిస్తుంది.

విద్యాబాల‌న్‌, రానా ద‌గ్గుబాటి, ముర‌ళీశ‌ర్మ‌, జిన్ సేన్ గుప్తా, స‌చిన్ ఖేడేక‌ర్ త‌దిత‌రుల‌తో పాటు అతిథి పాత్ర‌ల్లో సుమంత్‌, రాశీఖ‌న్నా, మంజిమ మోహ‌న్‌, షాలిని పాండే, త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు.. టి.డి.పిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుగా న‌టుడు డా.భ‌ర‌త్ రెడ్డి న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ న‌టుడి నుండి సి.ఎంగా ఎలా గెలిచారు అనే క్ర‌మం వ‌ర‌కు సినిమా క‌థ ఉంటుంది.