తెలుగు సినిమా ఉన్నంత వరకూ అక్కినేని ఉంటారు: నాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కారాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 2018 సంవత్సరానికి శ్రీదేవి, 2019 సంవత్సరానికి రేఖకు అక్కినేని జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కాగా.. అతిలోక సుందరి శ్రీదేవి తరపున అక్కినేని పురస్కారాన్ని ఆయన భర్త బోనీకపూర్ అందుకున్నారు. కాగా ఈ అవార్డుల ప్రధానం మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్‌కు బాగా కావాల్సిన వ్యక్తి సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఇదిలా ఉంటే ఈ వేడుకను వీక్షించేందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు విచ్చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్వయంగా నాగార్జున కుటుంబసభ్యులు స్వాగతం పలికారు.
తెలుగు సినిమా ఉన్నంత వరకూ!
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తన తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ‘సినిమా తల్లి ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోడానికే నాన్న అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు. అక్కినేని జాతీయ పురస్కారంతోపాటు నాన్న తనపేరు కూడా పరిశ్రమలో చిరకాలం ఉంటుందుకునేవారు. శ్రీదేవి, రేఖలకు అక్కినేని జాతీయ పురస్కారం ఇవ్వాలని నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు.
తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేనిగారు ఉంటారు. నేషనల్ అవార్డుతోపాటు నాన్నగారు ఈ వేదికపైనే ఉన్నారు’ అని నాగ్ చెప్పుకొచ్చారు. అనంతరం అవార్డుల వితరణ కార్యక్రమం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout