జయప్రదగా..జయసుధగా..
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్` చిత్రీకరణను జరుపుకుంటుంది. బాలకృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 9న సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బసవతారం పాత్రలో విద్యాబాలన్, నారా చంద్రబాబు నాయుడి పాత్రలో రానా, ఎ.ఎన్.ఆర్‌గా సుమంత్, ఎల్.వి.ప్రసాద్ పాత్రలో జిషు సేన్ గుప్తా, నాదెండ్ల భాస్కరరావు సచిన్ ఖేడేకర్, నిర్మాత నాగిరెడ్డి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఇంకా మురళీ శర్మ, దేవీప్రసాద్, నరేశ్ తదితరులు నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలసిందే.. కాగా జయప్రద, జయసుధ పాత్రలు కూడా కనపడతాయట. అయితే పాత్రల నిడివి పెద్దగా ఉండకపోవచ్చునంటున్నారు. తాజా సమాచారం ప్రకారం జయప్రద పాత్ర కోసం రాశీ ఖన్నాను, జయసుధ పాత్ర కోసం షాలిని పాండేను సంప్రదిస్తున్నారట చిత్ర యూనిట్ త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com