తార‌క్ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కొడుకుగా..

  • IndiaGlitz, [Thursday,April 19 2018]

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు నవీన్ చంద్ర. త‌న విల‌క్ష‌ణ‌మైన‌ న‌ట‌న‌తో ప్రేక్షకులకు చేరువ‌య్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా.. కెరీర్‌కైతే అవి ఏమాత్రం ప్లస్ కాలేదు. ఇక 2016లో వచ్చిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా కూడా హీరోగా నవీన్‌కి మంచి పేరుని తీసుకువ‌చ్చింది. అలాగే.. నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ మూవీలో తొలిసారిగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి మెప్పించారు న‌వీన్‌. 

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చరణ్‌కు అన్నగా న‌వీన్‌ కనిపించ‌నున్న‌ట్లు సమాచారం. ఈ చిత్రంతో పాటు.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో కూడా న‌వీన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో జగపతి బాబుకి కొడుకుగా న‌వీన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు  క్లిక్ అయితే.. ఈ హీరో ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కొనసాగుతారేమో.

More News

హాలీవుడ్ చిత్రాల్ని మ‌రిపించేలా అత్యద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రం సంజీవని మే నెలాఖ‌రున విడుద‌ల

గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో

'భరత్ అనే నేను' లో రొమాంటిక్ ట్రాక్ కీల‌క‌మ‌ట‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘భరత్ అనే నేను’.

లాగిన్ మీడియా ప్రొడక్షన్ నెం 2 చిత్ర ప్రారంభోత్సవం..

లాగిన్ మీడియా శ్రీధర్ రెడ్డి ఆశీస్సులతో బాలరాజు గౌడ్ సమర్పించు ప్రొడక్షన్ నెంబర్.2

నా పేరు సూర్య సాంగ్ కి సినిమాటోగ్ర‌ఫి అందించిన‌ హ‌లీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్‌ జోసెఫ్ లబిసి

ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మరియు ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ ల‌బిసి

'నీ ప్రేమ కోసం' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

జొన్న ప‌ర‌మేష్‌, రాధ బంగారు జంట‌గా ఉలి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ గోవింద్ బోగోజు స‌మ‌ర్ప‌ణ‌లో