తారక్ చిత్రంలో జగపతిబాబు కొడుకుగా..
Send us your feedback to audioarticles@vaarta.com
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు నవీన్ చంద్ర. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా.. కెరీర్కైతే అవి ఏమాత్రం ప్లస్ కాలేదు. ఇక 2016లో వచ్చిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా కూడా హీరోగా నవీన్‌కి మంచి పేరుని తీసుకువచ్చింది. అలాగే.. నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ మూవీలో తొలిసారిగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి మెప్పించారు నవీన్.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చరణ్‌కు అన్నగా నవీన్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో పాటు.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో కూడా నవీన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో జగపతి బాబుకి కొడుకుగా నవీన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు క్లిక్ అయితే.. ఈ హీరో ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కొనసాగుతారేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com