బెల్లంకొండ శ్రీనివాస్ జ‌త‌గా...

  • IndiaGlitz, [Saturday,March 02 2019]

1970 ద‌శకంలో పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి రాబిన్‌హుడ్‌గా పేరు మోసిన దొంగ నాగేశ్వ‌రావు జీవితంపై సినిమా రానుంది. స్టూవ‌ర్టుపురం ప్రాంతంలోని నాగేశ్వ‌ర‌రావు చాలా తెలివిగా దొంగ‌త‌నాలు చేసేవాడు. పోలీసులు అరెస్టు చేసిన తెలివిగా త‌ప్పించుకునేవాడు. ఇత‌న్ని అంద‌రూ టైగ‌ర్ నాగేశ్వ‌రరావు అని పిలిచేవారు.

1978లో ఈయ‌న్న పోలీసులు కాల్చి చంపేశారు. ఇప్పుడు ఈయ‌న జీవిత క‌థ‌ను సినిమా రూపంలో తేనున్నారు. 'దొంగాట‌', 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త' సినిమాల డైరెక్ట‌ర్ వంశీకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఈ సినిమాకు టైగ‌ర్ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని అనీల్‌ సుంక‌ర నిర్మిస్తాడు.

ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నారు. ఆర్‌.ఎక్స్ 100 బ్యూటీ ఇప్పుడు ర‌వితేజ‌తో డిస్కోరాజా, వెంక‌టేష్ స‌ర‌స‌న వెంకీమామ చిత్రంతో పాటు ఓ మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న చిత్రంలో న‌టిస్తుంది. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కాబోయే టైగ‌ర్ సినిమాలో కూడా పాయల్ న‌టించ‌నుంది.

More News

టీడీపీలో చేరిన కోట్ల దంపతులు

దశాబ్దాలుగా కాంగ్రెస్‌‌లో ఉన్న కోట్ల కుటుంబం పార్టీకి 'చేయి' ఇచ్చి టీడీపీలో చేరిపోయింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ అంటే కోట్ల ఫ్యామిలీ.. కోట్ల అంటే కాంగ్రెస్ అన్న రీతిలో పరిస్థితులు

చంద్రబాబుపై మోహన్‌బాబు సంచలన ఆరోపణలు

రాజకీయాల్లో అయినా.. సినీ ఇండస్ట్రీ పరంగా అయినా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేసే వ్యక్తి నటుడు మంచు మోహన్‌బాబు.

పాక్ మీడియా కథనం పై పవన్ రియాక్షన్...

‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాతో రెండేళ్ల కిందటే చెప్పారు’ అని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రజా పోరాటయాత్రలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

నాగసౌర్య , మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో చిత్రం

విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు...వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ

యావత్ భారత్‌ను కంటతడిపెట్టించిన మహిళా ఫైలట్‌..

భార్య భర్తలిద్దరూ ఇండియన్‌‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రన్‌ లీడర్‌‌‌‌‌లు. భారత్ గడ్డపై పుట్టినందుకుగాను దేశానికి తమవంతుగా సేవ చేయాలని భావించి ఇద్దరూ ఎయిర్‌‌ఫోర్స్‌‌లో చేరారు.