పల్లెటూరి అమ్మాయిగా...
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన హలో సినిమాలో నటించిన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనుంది. ముందుగా మెహరీన్ సహా పలువురు పేర్లు వినిపించినా.. మేకర్స్ కల్యాణి వైపు మొగ్గు చూపారు.
సమాచారం ప్రకారం ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. అందులో కల్యాణి ప్రియదర్శన్ ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపింనుందట. అలాగే శర్వానంద్ ఓ మాఫియా లీడర్ పాత్రలో కనిపించనున్నారట. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `పడి పడి లేచె మనసు` సినిమా కూడా చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments