తమిళం మాట్లాడే యువకుడిగా...
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన పాత్రలు చేసే నటుల్లో ముందుండే కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మరోసారి తన మార్కు చూపించుకుంటున్నాడు. విజయ్ నటిస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రం `సైరా నరసింహారెడ్డి`. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటిస్తాడని తెలియగానే.. ఎలాంటి పాత్ర చేయబోతున్నాడనే దానిపై అందరిలో కాస్త ఆసక్తి నెలకొంది.
సైరాలో తన పాత్ర గురించి విజయ్ సేతుపతి ఓ విషయాన్ని వెల్లడించాడు. తను తమిళం మాట్లాడే యువకుడిగా నటిస్తున్నానని తెలిపారు. ఆ తమిళం కూడా సరిగ్గా మాట్లాడటం చేత కాకుండా దాని నుండి కామెడీని పుట్టించే పాత్రలో విజయ్ సేతుపతి కనపడతారట. త్వరలోనే విజయ్ సేతుపతి సన్నివేశాల చిత్రీకరణ జరగబోతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com