విప్లవ నాయకుడి పాత్రలో...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళుల హక్కుల కోసం పరాయి దేశమైనా శ్రీలంకలో పోరాడిన వ్యక్తి వేలు పిళ్లై ప్రభాకరన్. ఎల్.టి.ఇ.ఇ అనే అతివాద సంస్థను స్థాపించి కొందరు రాజకీయ నాయకులను కూడా హతమార్చారు. అందులో మన దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఉన్నారు.
ఆయన ప్రయాణంలో రెండు కోణాలున్నాయి. ఉద్యమం హింసను ప్రేరేపించినా.. అయన చేసిన పోరాటం బలహీన, బడుగు ప్రజల కోసమేననేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ఎల్.టి.ఇ.ఇ తీవ్రవాద సంస్థ కావడంతో.. ప్రభాకరన్ జీవితాన్ని నేరుగా చూపించాలనుకునే చాలా చిత్రాలను విడుదల కానీయకుండా ప్రభుత్వాలు అడ్డుకున్నాయి.
అయితే ఇప్పుడు ప్రభాకరన్ జీవితాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాకరన్ పాత్రలో జాతీయ అవార్డ్ విన్నర్ బాబీ సింహ కనిపిస్తారట. ప్రభాకరన్ పుట్టుక నుండి మిలిటెంట్ లీడర్‌గా ఎదిగే వరకు ఈ చిత్రంలో కథాంశంగా ఉంటుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments