ప్రియురాలి కోసం ప్రొడ్యూసర్‌గా...
- IndiaGlitz, [Thursday,February 21 2019]
కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార సినిమాలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది.. లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నయన సినిమాలు 50 కోట్ల క్లబ్లో కూడా చేరాయి. ఇప్పుడు ఈమె కోసం ఆమె లవర్ విఘ్నేష్ శివన్ ప్రొడ్యూసర్‌గా మారాడని సమాచారం.
దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా ఉన్న విఘ్నేష్ శివన్ నయన తదుపరి సినిమాకు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారని వార్తలు వినపడుతున్నాయి. అయితే.. కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే కాదు.
తనే మెయిన్ నిర్మాత అని.. తన పేరు రాకుండా జాగ్రత్త పడుతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. విఘ్నేష్ శివన్, నయనతార ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారో తెలియదు కానీ అనధికార భార్యభర్తల్లా ఎంచక్కగా టూర్లలో కనపడుతున్నారీ జంట.