అన్న కాదు విల‌నే...

  • IndiaGlitz, [Saturday,August 04 2018]

మాస్ డైరెక్ట‌ర బోయ‌పాటి త‌న సినిమాల్లో ఎవ‌రో ఒక‌రిని విల‌న్ పాత్ర‌ల్లో కొత్త‌గా ప‌రిచ‌యం చేస్తుంటాడు. ఆయ‌న ప‌రిచ‌యం చేసిన జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ఇప్పుడు బోయ‌పాటి రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఆర్య‌న్ రాజేశ్ చ‌ర‌ణ్ అన్న‌య్య పాత్ర‌లో న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆర్య‌న్ రాజేశ్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. కియరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ మెయిన్ విల‌న్‌గా న‌టిస్తాడు. ప్ర‌శాంత్‌, స్నేహ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది.