సూర్య చిత్రంలో విలన్‌గా ఆర్య
Send us your feedback to audioarticles@vaarta.com
వీడొక్కడే, బ్రదర్స్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు కె.వి.ఆనంద్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్‌లో చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమాలో సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్ లాల్ విలన్‌గా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బొమన్ ఇరాని, అల్లు శిరీష్ నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో తమిళ నటుడు ఆర్య కూడా విలన్ పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆర్య లండన్‌లో దర్శనమివ్వడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నట్లయ్యింది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘వరుడు’ చిత్రంలోనూ ఆర్య విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా తెరపైకి రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com