అఖిల్ హీరోయిన్‌తో ఆర్య పెళ్లి!
- IndiaGlitz, [Thursday,January 31 2019]
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తొలి సినిమా 'అఖిల్'లో హీరోయిన్ సాయేషా సైగల్ గుర్తుందా? త్వరలో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోతుందని చెన్నై టాక్. అదీ ఓ హీరోని పెళ్లి చేసుకోనుందని టాక్. ఈమె ఒకప్పటి ప్రముఖ హిందీ హీరో దిలీప్ కుమార్ కి మనవరాలు అవుతుంది. దిలీప్ భార్య సైరా బాను మేనకోడలే సాయేషా తల్లి, నటి షహీన్ బాను. కుమార్తె ప్రేమకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట!
తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన తమిళ హీరో ఆర్య, సాయేషా ప్రేమలో వున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తమిళ సినీ పరిశ్రమ వర్గాల సమాచారం. వీరిద్దరూ 'గజినీకాంత్' సినిమాలో జంటగా నటించారు. తెలుగు హిట్ 'భలే భలే మగాడివోయ్'కి తమిళ రీమేక్ అది. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో ప్రేమలో పడ్డారని, వీరి ప్రేమకు పెద్దల నుంచి అనుమతి లభించిందట. హైదరాబాద్ లో మార్చి 10న పెళ్లికి ఏర్పాట్లు చేశారట.