'రాజరథం' లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఆర్య
Send us your feedback to audioarticles@vaarta.com
'రంగితరంగ' చిత్రం చూసి ఇన్‌స్పైర్ అయి 'రాజరథం' చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన ఆర్య తన మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డ్ నామినేషన్ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్ భండారి ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. జాలీహిట్స్ ప్రొడక్షన్స్ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి 'రంగితరగ' చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ అనూప్ భండారిని 'రాజరథం' చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంతో తమిళ హీరో ఆర్య కన్నడ సినిమా రంగంలో అడుగుపెడుతున్నారు. 'రంగితరంగ' సినిమాను థియేటర్‌లో వీక్షించిన హీరో ఆర్య అనూప్ భండారి తండ్రి సుధాకర్ భండారికి ఫోన్ చేసి తన అభినందనలను తెలియజేశారు.
సైకిలింగ్ అంటే అమితాసక్తి చూపే ఆర్య లండన్‌లో నాలుగున్నర రోజుల్లో 1400 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై చుట్టి వచ్చిన సంగతి తెలిసిందే. లండన్‌లో జరిగిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నప్పుడు అనూప్ భండారి ఆర్యకు ఫోన్ చేసి 'రాజరథం' స్క్రిప్ట్‌ను వినిపించారు. పదిహేను నిమిషాల సైక్లింగ్ బ్రేక్‌లో సినిమాలో తన క్యారెక్టర్‌ను విన్న ఆర్య వెంటనే 'రాజరథం' సినిమాలో నటించడానికి రెండో ఆలోచన లేకుండా అంగీకరించారు. ఆర్య గతంలో నటించిన పాత్రలకు భిన్నంగా ఈ చిత్రంలో పాత్రని దర్శకుడు తీర్చిదిద్దారు.
ఆర్య సినిమా రంగంలో అడుగుపెట్టి 'నాన్ కడవుల్(నేను దేవుడ్ని)', 'రాజా రాణి', 'నేనే అంబాని', 'మదరాసు పట్టణం' వంటి చిత్రాల్లో నటించి హీరోగా తనదైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సుందర్ సి. దర్శకత్వంలో రూపొందనున్న భారీ బడ్జెట్ చిత్రం 'సంఘమిత్ర'లో బిజీగా వున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాజరథం' చిత్రంలో నిరూప్ భండారి, అవంతిక శెట్టి, పి.రవిశంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అజనీష్ లోక్‌నాథ్, ఎడిటింగ్: శాంతకుమార్, సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్, నిర్మాణం: జాలీహిట్స్ టీమ్, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: అనూప్ భండారి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments