ఆర్య హీరోగా 'సామ్రాజ్యం'

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

ప్ర‌తి మ‌నిషి పుట్టుక‌కూ ఓ కార‌ణం ఉంటుంది. త‌ప్ప‌కుండా పుట్టిన ప్ర‌తిమ‌నిషీ ఏదో ఒక‌టి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు... ఈ నేప‌థ్యంలో ఆర్య హీరోగా త‌మిళంలో ఓ సినిమా తెర‌కెక్కింది. తెలుగులో 'సామ్రాజ్యం' పేరుతో అనువాద‌మ‌వుతోంది. ఈ సినిమాలో ఆర్యకు జోడీగా కీర్తి న‌టించారు. చ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. నైనాల సాంబ‌మూర్తి హైమావ‌తి స‌మ‌ర్పిస్తున్నారు. వీవీయ‌స్ క్రియేష‌న్స్ ప‌తాకంపై తెలుగులోకి అనువాద‌మ‌వుతోంది. నైనాల సాయిరామ్ అనువ‌దిస్తున్నారు. రాజ‌శ్రీ మ‌ణికంఠ స‌హ నిర్మాత‌.

'సామ్రాజ్యం' నిర్మాత నైనాల సాయిరామ్ మాట్లాడుతూ ''ఆర్య కెరీర్‌లో చేసిన తొలి మాస్ సినిమా ఇది. త‌మిళంలో మంచి హిట్ అయింది. తెలుగుకు ప‌క్కాగా స‌రిపోయే స‌బ్జెక్ట్ ఇది. ప్ర‌తి మ‌నిషి పుట్టుక‌కు ఓ కార‌ణం ఉంటుంది. అలాగే మా హీరో పుట్టుక‌కు కూడా కార‌ణం ఉంది. త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రించుకోవ‌డం కోసం హీరో ఏం చేశాడు? ఎలా పోరాడాడు? ఎవ‌రితో ఎలా త‌ల‌ప‌డ్డాడు? అనేది ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌. అనువాద ప‌నులు పూర్త‌య్యాయి. ఐదు పాట‌లు, యాక్ష‌న్ సీక్వెన్స్, కామెడీ సినిమాకు హైలైట్ అవుతాయి. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం'' అని అన్నారు.

నాజ‌ర్‌, నెపోలియ‌న్‌, అదిశ‌య అవినాష్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సంగీతం: భ‌ర‌ద్వాజ్‌, పాట‌లు: శివ‌గ‌ణేష్‌, బాల‌వ‌ర్ధ‌న్‌, హ‌రిదాస్ సింగ‌టూరి, మాట‌లు: రాజ‌శేఖ‌ర్ రెడ్డి, స‌హ నిర్మాత‌: రాజ‌శ్రీ మ‌ణికంఠ‌, స‌మ‌ర్ప‌ణ‌: నైనాల సాంబ‌మూర్తి హైమావ‌తి, నిర్మాత‌: నైనాల సాయిరామ్‌.

More News

కీర్తి... 123!

కీర్తి సురేష్ న‌టించిన తెలుగు సినిమా ఇంకా ఒక‌టి కూడా విడుద‌ల కాలేదు. కానీ అప్పుడే ఆమె చేతిలో తెలుగులో మూడు సినిమాలున్నాయి.

కార్తికేయ సీక్వెల్

కార్తికేయ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది.అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయి.ఇప్పుడు నాగచైతన్య హీరోగా మజ్ను సినిమా పనుల్లో బిజీగా ఉన్న చందు మొండేటికి దర్శకుడిగా తొలి సినిమా ఇదే.

కోన కి షాక్ ఇచ్చిన నిఖిల్..

నిఖిల్ హీరోగా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ తెర‌కెక్కించారు.

క్రిష్ రాయ‌బారి ఇత‌డే..

కంచె సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన క్రిష్ త‌దుప‌రి చిత్రం కోసం రాయ‌బారి అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు.

మ‌హేష్ మ‌న‌సు దోచుకున్న నాయిక‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఎంతో మందికి మ‌హేష్ ఫేవ‌రేట్ హీరో. మ‌రి..మ‌హేష్ ఫేవ‌రేట్ హీరోయిన్ ఎవ‌రు..?