కన్నడంలో హీరో ఆర్య
- IndiaGlitz, [Tuesday,October 10 2017]
తన మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డ్ నామినేషన్ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్ భండారి ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి,టాలెంటెడ్ డైరెక్టర్ భారతీయ సినిమా రంగానికి తన మొదటి చిత్రం 'రంగితరంగ' తో సుపరిచితమైన అనూప్ భండారి తెరకెక్కిస్తున్న 'రాజరథం' చిత్రంతో తమిళ హీరో ఆర్య కన్నడ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. 'రంగితరంగ' సినిమాను థియేటర్‌లో వీక్షించిన హీరో ఆర్య అనూప్ భండారి తండ్రి సుధాకర్ బండారికి ఫోన్ చేసి తన అభినందనలను తెలియజేశారు.
సైకిలింగ్ అంటే అమితాసక్తి చూపే ఆర్య..లండన్‌లో నాలుగున్నర రోజుల్లో 1400 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై చుట్టిన వచ్చిన సంగతి తెలిసిందే. లండన్‌లో జరిగిన సైకిల్ ర్యాలీలో ఆర్య పాల్గొన్నప్పుడు దర్శకుడు అనూప్ భండారి, తనను కలిసి స్క్రిప్ట్‌ను వినిపించాడు. పదిహేను నిమిషాల బ్రేక్‌లో తన క్యారెక్టర్‌ను విన్న ఆర్య వెంటనే రాజరథం సినిమాలో నటించడానికి రెండో ఆలోచన లేకుండా అంగీకరించారు.
ఒకప్పటి కర్ణాటక రాష్ట్రంలో భాగమై, తర్వాత తమిళనాడులో కలిసిన కాసర్ ఘాడ్ జిల్లోని కంజన్‌గడ్/త‌్రికరిపూర్ ప్రాంతానికి చెందిన హీరో ఆర్య అని చాలా మందికి తెలియదు. ఈ ప్రాంతం కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి సమీపాన ఉంటుంది. తర్వాత కాలంలో ఆర్య చెన్నైలో చదువుకున్నారు. సినిమా రంగంలో అడుగుపెట్టి 'నాన్ కడవుల్(నేను దేవుణ్ణి)', 'రాజా రాణి', 'మదరాసు పట్టణం' వంటి చిత్రాల్లో నటించి హీరోగా తనదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో రూపొందనున్న 'సంఘమిత్ర' సినిమాలో బిజీగా ఉన్నారు.