అనుష్క గురించి ఆర్య కామెంట్

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

అందం, అభిన‌యం...ఈ రెండింటికి మ‌రో పేరు అనుష్క‌. అరుంథ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి...ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించి సౌతిండియా స్టార్ హీరోయిన్ గా బాగా పాపుల‌ర్ అయిన అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో ఈ భారీ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో హీరోగా ఆర్య న‌టించారు.

ఈ సినిమా త‌మిళ్ వెర్ష‌న్ ఆడియో ఫంక్ష‌న్ చెన్నైలో జ‌రిగింది. ఈ వేడుక‌లో ఆర్య మాట్లాడుతూ...ఈ సినిమా కోసం అనుష్క 25 కేజీల బ‌రువు పెరిగారు. అనుష్క డెడికేష‌న్ చూసి షాక‌య్యాను. సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్, విక్ర‌మ్ ఎంత శ్ర‌మిస్తారో తెలిసిందే. వీళ్లిద్ద‌రి డెడికేష‌న్ క‌లిస్తే అనుష్క అంటూ అనుష్క‌ని తెగ పొగిడేసాడు ఆర్య‌. కీర‌వాణి సంగీతాన్ని అందించిన సైజ్ జీరో తెలుగు వెర్ష‌న్ ఆడియోను న‌వంబ‌ర్ 1న‌, సినిమాను న‌వంబ‌ర్ 27న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

కోనా..ఇది నిజమా..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించి బ్రూస్ లీ చిత్రం ద‌స‌రా కానుక‌గా రిలీజై...ఆశించిన స్ధాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే.

మొత్తానికి న‌య‌న‌తార సినిమా వ‌స్తోంది

'వ‌ల్ల‌భ' వంటి వివాద‌స్ప‌ద చిత్రం త‌రువాత శింబు, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'ఇదు న‌మ్మ ఆళు'.

'ఎక్స్‌ప్రెస్ రాజా'కి అన్నీ ప్ల‌స్‌లే..

కొన్ని సినిమాలు నిర్మాణ ద‌శ‌లోనే క్రేజ్‌ని మూట‌గ‌ట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో.. శ‌ర్వానంద్ హీరోగా వ‌స్తున్న 'ఎక్స్‌ప్రెస్ రాజా'ని కూడా చేర్చుకోవ‌చ్చు.

శ్రుతి హాస‌న్‌ని డామినేట్ చేసేలా..

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది శ్రుతి హాస‌న్‌. ఈ దీపావ‌ళికి అజిత్‌తో న‌టించిన త‌మిళ చిత్రం 'వేదాళ‌మ్'తో త‌న మాతృభాష ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది శ్రుతి.

మ‌ళ్లీ అలాగే వ‌స్తున్న స్వాతి

అందం, అభిన‌యం.. ఈ రెండూ మెండుగా ఉన్న తెలుగమ్మాయి స్వాతి.. అతి త్వ‌ర‌లో 'త్రిపుర‌'గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.