'ఆర్య' వన్ సైడ్ లవ్ కి 12 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
వన్ సైడ్ లవ్‌లోని గొప్పతనాన్ని చెబుతూ ప్రేక్షకులకి సరికొత్త ప్రేమకథని పరిచయం చేసిన చిత్రం 'ఆర్య'. కథానాయకుడిగా అల్లు అర్జున్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలవడమే కాకుండా, దర్శకుడిగా పరిచయమైన సుకుమార్‌కి శుభారంభాన్నిచ్చిందీ సినిమా. తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ఫ్రెష్‌నెస్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేయాలన్న సుకుమార్ తపన ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనిపిస్తుంది కాబట్టే 'ఆర్య' 2004లో సమ్మర్ సెన్సేషన్‌గా నిలిచింది.
ఇక యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ సూపర్ హిట్టే. వెస్ట్రన్, ఫోక్, మెలోడీ, రాక్.. ఇలా అన్ని రకాల బాణీలతో అలరించాడు. ముఖ్యంగా 'అ అంటే అమలా పురం' అనే ప్రత్యేక గీతం అప్పట్లో సంచలనంగా నిలిచింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2004లో మే 7న రిలీజైంది. అంటే 'ఫీల్ మై లవ్' అంటూ సందడి చేసిన 'ఆర్య'కి నేటితో 12 వసంతాలు పూర్తవుతున్నాయన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments