బన్ని, సుకుమార్ కాంబోలో ఆర్య 3
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఆర్య సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రేమను సరికొత్తగా చూపించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ ఇమేజ్‌నే మార్చేసింది. ఆతర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలసి ఆర్య 2 తీసారు.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆర్య 3 కూడా తీయాలని బన్ని, సుక్కు అనుకున్నా...ఎందుకనో తీయలేదు. అయితే సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ ఆడియో వేడుకలో అభిమానులు బన్నిని ఆర్య 3 ఎప్పుడు అని అడిగితే...ఆర్య 3 కాదు కానీ...సుకుమార్, నేను కలసి ఆర్యను మించేలా సినిమా చేస్తాం అని ప్రకటించాడు. మరి... నాన్నకు ప్రేమతో...తర్వాత సుకుమార్ చేసే సినిమా బన్నితోనే ఉంటుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments