మ‌రో తెలుగులో సినిమాలో విల‌న్‌గా అర‌వింద‌స్వామి..?

  • IndiaGlitz, [Thursday,May 07 2020]

అర‌వింద‌స్వామి.. 1980-90 సినిమాల్లో హీరోగా న‌టించి అప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయారు. అయితే సినిమా రంగం నుండి ఆయ‌న ఉన్న‌ట్లుండి ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి వెండితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే కేవ‌లం హీరోగానే సినిమాలు చేస్తాన‌ని కాకుండా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి కూడా రెడీ అయిపోయారు. త‌మిళంలో విల‌న్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న తెలుగులోనూ ధృవ చిత్రంలో విల‌న్‌గా న‌టించి మెప్పించారు. పాత్ర న‌చ్చితే త‌ప్ప తాను విల‌న్‌గా చేయ‌న‌ని, రొటీన్ విల‌నిజం చేయ‌డానికి తాను ఇష్ట‌ప‌డ‌న‌ని చెప్పేశాడు.

అయితే చాలా ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి అరవింద‌స్వామి విల‌న్‌గా న‌టించ‌బోతున్నార‌ట‌. ఇంత‌కు అర‌వింద‌స్వామి విల‌న్‌గా న‌టించ‌బోయే చిత్ర‌మేదో తెలుసా!. ప్ర‌భాస్ 21వ చిత్రం. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో విల‌న్‌గా అర‌వింద‌స్వామిని అప్రోచ్ అవుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను భారీ బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. మ‌హాన‌టితో నేష‌న‌ల్ అవార్డ్ కొట్టిన నాగ్ అశ్విన్ ఒకప‌క్క‌, మ‌రో ప‌క్క నేష‌న‌ల్ రేంజ్ హీరో ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.