'భాస్కర్ ఒక రాస్కల్ ' గా వస్తున్న అరవింద స్వామి
Send us your feedback to audioarticles@vaarta.com
అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో సిద్ధికీ తమిళంలో రూపొందిన భాస్కర్ ఓరు రాస్కల్ ఇప్పడు తెలుగులో భాస్కర్ ఒక రాస్కల్ పేరుతో రాబోతోంది. కార్తికేయ మూవీస్ పతాకంపై పఠాన్ చాన్ బాషా అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ నెలలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ, ఇదే చిత్రాన్ని తొలుత మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా దర్శకుడు సిద్ధికీ రూపొందించారు. అక్కడ విజయం సాధించడంతో సిద్ధికీ మళ్లీ తన దర్శకత్వంలోనే నటీనటుల మార్పుతో తమిళ తెరకెక్కించారు. తమిళంలో కూడా ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణ లభించడంతో తెలుగులో విడుదల చేసేందుకు పూనుకున్నాను. తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు. వారు అలా కలిసేందుకు ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేసారు అన్న ఆసక్తి దాయకమైన ఇతివృత్తంతో ఆద్యంతం హాస్య ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని...ఊహించని ఓ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేస్తుందని నిర్మాత పఠాన్ చాన్ బాషా వెల్లడించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ఓ ప్రధాన భూమిక పోషించింది. అరవిందస్వామి, అమలాపాల్ తమ పాత్రలలో అద్భుతమైన నటనను కనబరిచారు. అమ్రిష్ గణేష్ సమకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. నవంబర్ రెండో వారంలో ఆడియోను, ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. అదే నెలలో సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో నాజర్, నికీషా పటేల్, రోబో శంకర్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత: పఠాన్ చాన్ బాషా. దర్శకత్వం: సిద్ధికీ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout