Mission: Chapter 1:నాలుగు భాషల్లో అరుణ్ విజయ్ భారీ చిత్రం ‘మిషన్: చాప్టర్ 1’
- IndiaGlitz, [Monday,April 03 2023]
భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్. సినిమాలను నిర్మించటంతో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన పంథాలో ఈ సంస్థ రాణిస్తోంది. ఎవరూ టచ్ చేయని అంశాలతో వైవిధ్యమైన కథాంశాలున్న సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోంది లైకా ప్రొడక్షన్స్. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిషన్: చాప్టర్ 1’ తాజాగా లైకా ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్నక్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో చేరింది. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మాతలు.
సినీ ఇండస్ట్రీలో దిగ్గజ చిత్రాలుగా అందరి ఆదరాభిమానాలను పొందిన 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘మిషన్: చాప్టర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక పరిమితమైన హద్దులని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావించింది లైకా టీమ్. ఈ క్రమంలో భాషా పరమైన హద్దులను ఈ సినిమా దాటుతుందని లైకా ప్రతినిధులు భావించారు. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు నిర్మాతలు.
విలక్షణమైన సినిమాలను తెరకెక్కించే ప్రతిభ ఉన్న దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన చిత్ర నిర్మాణంలోని పలు విభాగాలతో పాటు ప్రజల అభిరుచులను ఆధారంగా చేసుకుని సినిమాలను రూపొందిస్తుంటారు. ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని కేవలం 70 రోజుల్లో లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విషయం.
అద్భుతమైన టెక్నికల్ అంశాలతో రూపొందిన ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రం హీరో అరుణ్ విజయ్ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతుందనటంలో సందేహం లేదు. చాలా గ్యాప్ తర్వాత.. 2.0లో నటించి అలరించిన ముద్దుగుమ్మ ఎమీ జాక్సన్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటి నిమిషా సజయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జి.వి.ప్రకాష్ ఈ చిత్రానికి సంగీత సారథ్యాన్ని వహిస్తున్నారు.
ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన యాక్షన్ సన్నివేశాలు సినిమాను చూసే ప్రేక్షకులకు ఆహా అనిపిస్తాయి. ఈ సినిమాలో చిత్రీకరించిన నైట్ షాట్స్, డ్రామా ప్రేక్షకులను ఉత్కంఠతకు లోను చేస్తుంది.
యాక్షన్ సన్నివేశాల్లో ఎంత కష్టమున్నప్పటికీ హీరో అరుణ్ విజయ్ వెనకడుగు వేయలేదు. ఆయనే స్వయంగా ఆ సన్నివేశాల్లో నటించారు. దీంతో యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా వచ్చాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
నటీనటులు: అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్, నిమిషా సజయన్, అబి హాసన్, భరత్ బొపన్న, బేబి ఇయల్, విరాజ్ ఎస్, జాసన్ షా
సాంకేతికవర్గం: దర్శకత్వం: విజయ్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జికెఎం తమిళ్ కుమరన్, నిర్మాత - సుభాస్కరన్, ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి, కో ప్రొడ్యూసర్: సూర్య వంశీ ప్రసాద్ కోత, జీవన్ కోత, మ్యూజిక్: జి.వి.ప్రకాష్ కుమార్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే: ఎ.మహదేవ్, డైలాగ్స్: విజయ్, సినిమాటోగ్రఫీ: సందీప్ కె.విజయ్, ఎడిటర్: ఆంథోని, స్టంట్స్ సిల్వ, ఆర్ట్ డైరెక్టర్: శరవణన్ వసంత్, కాస్ట్యూమ్స్ : రుచి మునోత్, మేకప్: పట్టనం రషీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.గణేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.మణి వర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ (యుకె): శివ కుమార్, శివ శరవణన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మనోజ్ కుమార్.కె, కాస్ట్యూమర్: మొడేపల్లి రమణ, సౌండ్ డిజైన్: ఎం.ఆర్.రాజశేఖరన్, వి.ఎఫ్.ఎక్స్: డినోట్, స్టిల్స్: ఆర్.ఎస్.రాజా, ప్రమోషన్, స్ట్రాటజీస్: షియం జాక్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ , ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), పబ్లిసిటీ డిజైనర్: ప్రతూల్ ఎన్.టి.