Hari's Enugu Trailer : ఊరుకుంటే రెచ్చగొడతారా.. ఫుల్ ప్యాక్డ్ మాస్ ఎలిమెంట్స్‌తో ‘ఏనుగు’
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్‌కి వైవిధ్యమైన చిత్రాలు చేస్తారనే పేరుంది. తమిళంలో హీరోగా నటిస్తూనే తెలుగులోనూ సత్తా చాటుతున్నాడు. బ్రూస్ లీ, సాహో వంటి సినిమాలతో తెలుగు వారికీ చేరువయ్యాడు. తాజాగా అరుణ్ నటించిన సినిమా ‘యానై’. తెలుగులో ‘ఏనుగు’గా వస్తోంది. సూర్యతో సింగం సిరీస్, విశాల్‌తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ ఏనుగు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు.
విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సీహెచ్ సతీష్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అరుణ్ విజయ్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సముద్ర ఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక శరత్ కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది చిత్ర యూనిట్ . దీనిలో భాగంగా ఆదివారం ‘ఏనుగు’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చూస్తుంటే ఓ చేపల చెరువు , దానిపై ఆదిపత్యం కోసం జరిగే పోరాటంగా తెలుస్తోంది. హరి గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ భారీ యాక్షన్ సీక్వెన్సులతో నింపేశాడు. అలాగే దీనిలో ఎప్పటిలాగే ఒక లవ్ ట్రాక్ కూడా మిక్స్ చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో ప్రియా బాగా నటించారు. ‘‘ఊరుకుంటే రెచ్చగొడతారా...? తప్పుకుంటే తరిమికొడతారా...? సర్దుకుపోదామని తెల్లజెండా ఊపితే దాన్ని కత్తులకి కడతార్రా అంటూ ’’ చివరిలో అరుణ్ విజయ్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా వంది. ఇక అన్నింటికి మించి టైటిల్ పడేటప్పుడు.. అరుణ్ విజయ్ చేతిలోనూ వినాయకుడి విగ్రహం సస్పెన్స్‌గా నిలిచింది. మరి అదేంటో , దాని వెనుకున్న కథేంటో తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments