ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా అరుణ్ మిశ్రా..!

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్ కమిటీ ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకూ వెలువడలేదు. ఎన్‌హెచ్ఆర్‌సీ నూతన చైర్మన్ ఎంపిక కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు.

ఈ కమిటీ జస్టిస్ అరుణ్ మిశ్రా పేరును సిఫార్స్ చేసింది. అయితే ‘ది హిందూ’ నివేదిక ప్రకారం ఖర్గే మాత్రం దీనిని విభేదించారు. కాగా.. దళిత, ఆదివాసి, మైనరిటీ కమ్యూనిటీల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నందున ఆ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయాలని ఖర్గే సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. జస్టిస్ అరుణ్ మిశ్రా 1978లో న్యాయవాదిగా తన వృత్తిని ఆరంభించారు. 1998-99లో అతి పిన్న వయసులోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎన్నికయ్యారు. అక్టోబర్ 1999లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా అరుణ్ మిశ్రా నియమితులయ్యారు. తరువాత ఆయన జూలై 7, 2014 న సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ముందు రాజస్థాన్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

సుప్రీంకోర్టులో అరుణ్ మిశ్రా పదవీకాలంలో ప్రముఖంగా జడ్జి లోయా కేసు, ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారం కేసులు ఆయనను వివాదంలోకి నెట్టివేశాయి. న్యాయమూర్తి బి.హెచ్. లోయా మరణంపై దర్యాప్తు కోరుతూ కేసును విచారించాలని ఆయన మొదట నిర్ణయించారు. ఈ కేసును జస్టిస్ మిశ్రాకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్-మోస్ట్ జడ్జిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన చివరికి ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. కాగా... మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్‌లో పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్‌పర్సన్ ఎంపిక జరగలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం ఎన్‌హెచ్ఆర్‌సీ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాగా, జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2020 సెప్టెంబర్ 2న పదవీ విరమణ చేశారు.

More News

వైరల్: రామ్ పోతినేని క్రేజీ న్యూలుక్ అదిరిందిగా..

ఎనెర్జిటిక్ హీరో రామ్ పోతినేని మాస్ చిత్రాలతో అలరిస్తూనే కొత్తదనం ఉన్న కథలకూ ప్రాధాన్యత ఇస్తాడు. రామ్ ప్రతి చిత్రంలో తన లుక్ విషయంలో కేర్ తీసుకుంటాడు.

హైదరాబాద్‌కు స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ 30 లక్షల డోసులు

రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ - వి వ్యాక్సిన్లు తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్‌ విమానాశ్రయానికి ఈ వ్యాక్సిన్‌ కంటైనర్లు వచ్చాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ దిగుమతులకు

కేటీఆర్ రియల్ హీరో.. సోనూసూద్ సూపర్ హీరో!

రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ముచ్చటించుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

పొలిటికల్ ఎంట్రీపై సోనూ సూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజకీయాల్లోకి రావడం కోసమే సోనూ సూద్ సేవ చేస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్‌లో వలస కూలీలకు బస్‌లు ఎరేంజ్ చెయ్యడం, ఈ ఇయర్ కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు,

2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలను జారీ చేసిన డీసీజీఐ

క‌రోనాకు బ్రహ్మాస్త్రంలా పనిచేసే 2డీజీ ఔషధం ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పొడి రూపంలో అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఔష‌ధం.. ఒక మోస్తరు నుంచి తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు