యమునా నది తీరంలో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
Send us your feedback to audioarticles@vaarta.com
కమల దళంలో ట్రబుల్ షూటర్, కేంద్ర మాజీ మంత్రి, మోదీ-షాలకు రైట్ హ్యాండ్‌గా పేరుగాంచిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు నేడు 2:30 గంటలకు యమునానది తీరంలోని నిగంబోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. జైట్లీ పార్థీవ దేహాన్ని మరికాసేపట్లో అనగా 1:30 గంటల వరకు కేంద్ర కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు, నేతలు కడసారి చూసేందుకు ఉంచుతారు. అనంతరం కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, దేశ వ్యాప్తంగా ఉన్న పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, రాజకీయ ఉద్ధండులు జైట్లీ భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments