అరుణ్ ఆదిత్ హీరోగా 'జిగేల్' ప్రారంభం 

  • IndiaGlitz, [Thursday,July 05 2018]

కథ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అరుణ్ ఆదిత్ ఇటీవల పి.ఎస్.వి గరుడ వేగ చిత్రంలో కీలకపాత్ర పోషించి నటుడిగా అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం తెలుగులో హీరోగా రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం జిగేల్.

శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాణ సారధ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ (జూలై 5) హైద్రాబాద్ లో జరిగింది. అరుణ్ ఆదిత్ సరసన జంబ లకిడి పంబ ఫేమ్ సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏలూరి మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం చిత్ర బృందం సమక్షంలో లాంఛనంగా జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ.. భారీ తారాగణంతో మంచి బడ్జెట్ తో తెరకెక్కనున్న హైక్వాలిటీ చిత్రం జిగేల్. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇవాళ మొదలైంది. అరుణ్ ఆదిత్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు అన్నారు.

జయప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్ధి, పోసాని కృష్ణమురళి, సత్య, సత్యం రాజేష్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: మంత్ర ఆనంద్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు,