గోదావరి వాసుల గుండెల్లో ఉన్నావ్ కాటన్ దొర!
Send us your feedback to audioarticles@vaarta.com
అన్నం పెట్టే రైతన్నకు సాగునీరు అందక అల్లాడుతున్న కాలంలో ధాన్యం పండించేందుకు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆనకట్టకు రూపకల్పన చేసిన మహనీయుడు సర్ ఆర్ధర్ కాటన దొర. ఈ విషయాన్ని గోదావరి ప్రజలు ఇప్పటికీ.. ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు.. ఆ భగీరథుడు, మహనీయుడు సర్ ఆర్ధర్ కాటన్ దొర జయంతి నేడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కృషి గుర్తుచేసుకుందాం. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరు అందించటంలో ఆయన చేసిన కృషికి డెల్టా ప్రాంతం అన్నపూర్ణగా వర్ధిల్లుతోందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సొంతదేశంలో దక్కని గుర్తింపు ఆంధ్రాలో..!
కాటన్ దొర.. ఇంగ్లాండ్లో పుట్టినా ఆంధ్రాలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. సొంతదేశం.. రక్త సంబంధీకుల వద్ద కూడా లభించని గుర్తింపు, మర్యాద ఆంధ్రప్రదేశ్లో దక్కింది.. కోనసీమ వాసులు ముద్దుగా ‘అపర భగీరధుడు’ అని పిలుచుకుంటూ మురిసిపోతారు. 1847లో ధవళేశ్వరం వద్ద సాగు నీటి ప్రాజెక్ట్ను ప్రారంభించి.. 1852 లో నీటి విడుదలను చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నేడు.. దాదాపు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంతోందంటే కేవలం కాటన్ చలవే.. అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న సమయంలో కాటన్ కొడుకు మరణించారు.. అయినా ప్రాజెక్ట్ పూర్తి అయితే రైతుల కళ్ళలో కనిపించే ఆనందం కోసం ఎంతో అంకితంగా పనిచేసిన మహానుభావుడు దొర. అయితే ఇప్పటికీ ధవళేశ్వరం ఆనకట్టలో ఒక్క చిన్న పగులుకాని.. చిన్న ఇసుకసున్నం ఉడిపోలేదు.. అంటే ఆ కట్టడం ఎలాందో ఉహించవచ్చు..!!. ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి జిల్లా వసూలు మేము కాటన్ వేసిన భిక్షతో బ్రతుకుతున్నాం అని అనడంలో అతిశయోక్తి లేదేమో..! 1982 నాటికి గోదావరి జిలాల్లో కాటన్ విగ్రహాలు 3000 ఉన్నాయి.. ఈ విగ్రహాలన్నీ గోదావరి జిల్లా వసూలు ఆయన మీద ప్రేమతో భక్తితో నిర్మించుకున్నవే.
కాటన్ దొరగారికి తర్పణాలు కూడా..!
అంతేకాదు.. బ్రాహ్మణులు రోజూ అర్ఘ్యం వదిలేటప్పుడే కాదు.. గోదావరికి పుష్కరాలొచ్చినప్పుడు కొంతమందైతే కాటన్ దొరగారికి తర్పణాలు కూడా వొదుల్తారు.. అదీ.. ఆయనగారంటే మావాళ్ళకున్న అభిమానం. పితృదేవతలకు సద్గతులు కల్పించడానికి గంగమ్మ తల్లిని భూమ్మీదకి రప్పించిన భగీరధుడుతో పోల్చడం కంటే.. తన జటాజూటాల్లో బంధించి పవిత్ర గంగాజలాలు ఎటు పడితే అటు ప్రవహించకుండా సరైన తీరులో కిందకి వొదిలిపెట్టి భూమాతకి, గంగామాతకి కూడా ఉపశమనం కలిగించిన పరమశివుడితో పోల్చడం కరెక్టని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments