డైరెక్టర్‌గా మారుతున్న ఆర్ట్ డైరెక్టర్..?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా రంగంలోకి అడుగు పెట్టేవారికి ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. కొందరు హీరోలు కావాలని, గొప్ప నటులు కావాలని, మరికొందరు మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకోవాలని, కొందరు దర్శకులుగా గొప్ప సినిమాలు తీయాలని అనుకుంటారు. అలా ఆర్ట్ డైరెక్టర్‌గా వచ్చిన ఓ వ్యక్తి దర్శకుడు కావాలని కలకన్నాడు. త్వరలోనే దర్శకుడిగా మారుతున్నాడని లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. మగధీర, ఈగ సహా పలు విజయవంతమైన చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నాడట. ఆ కథను నచ్చిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రవీందర్‌ని దర్శకుడిగా పెట్టి సినిమా చేయడానికి ఓకే చెప్పిందట. ఇంతకూ ఆ నిర్మాణ సంస్థ ఏదో తెలుసా? యువీ క్రియేషన్స్.
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసి సక్సెస్ అందుకుంటున్న నిర్మాణ సంస్థల్లో యువీ క్రియేషన్స్ ఒకటి. ఈ సంస్థ భారీ బడ్జెట్ చిత్రాలే కాదు.. చిన్న బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తుంటుంది. ఆ కోవలో రవీందర్ దర్శకత్వంలో ఓ లో బడ్జెట్ మూవీ ప్లాన్ చేసిందట. త్వరలోనే ఈ సినిమాపై ఓ స్టాండ్ తీసుకోనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com