కోడెల శివప్రసాద్ పై దాడి కేసులో నిందితుల అరెస్ట్
- IndiaGlitz, [Saturday,April 13 2019]
ఈ సారి ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు బీహార్ ఎన్నికలను తలపించాయి.పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు ... అసలు ఎన్నికలు జరుగుతుంది ఏపీలో నేనా అనుమానాన్ని కూడా రేకెత్తించాయి. ముఖ్యంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై జరిగిన దాడి... సినిమా లో యాక్షన్ సన్నివేశాన్ని గుర్తుచేసింది.
గుంటూరు జిల్లా రాజు పాలెం మండలం ఇనుమట్లలో దాదాపు 50 మంది ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు .... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. 30 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కూడా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా... మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సత్తెనపల్లి డీ ఎస్పీ కలేషావలి .... స్పీకర్ పై దాడికి పాల్పడిన వారు స్వచ్చందంగా లొంగి పోవాలని సూచిస్తున్నారు. లేదంటే పరిస్థితులు దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.