బెల్లంకొండ సురేష్‌కి అరెస్ట్ వారెంట్..?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కి అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ప్రముఖ ఛానెల్.. తమకు బెల్లంకొండ సురేష్ చెల్లించాల్సిన రూ.3.5 కోట్లను చెల్లించలేదంటూ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఆ మేర కోర్టు బెల్లంకొండ సురేష్‌కు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. 2010లో బాలీవుడ్లో విడుదలైన `బ్యాండ్ బాజా బరాత్` సినిమాను 2013లో `జబర్దస్త్` పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు.
దీనిపై యశ్ రాజ్ ఫిలింస్ కోర్టుకు వెళ్లింది. సదరు హిందీ చిత్రానికి సంబంధిచి తెలుగు సినిమా రీమేక్ సినిమాను ఎక్కడా ప్రదర్శించకూడదంటూ ఇటీవల తీర్పు ఇచ్చిన కోర్టు ఆదేశాలతో సదరు ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌కు నష్టం వాటిల్లింది. బెల్లంకొండ సురేశ్ ఛానెల్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా జాప్యం చేస్తుండటంతో 3.5 కోట్ల రూపాయల మొత్తం రూ.11.75 కోట్లకు చేరింది. దీంతో ఛానెల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు అరెస్ట్ జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments