CM Jagan:పేదవాడికి ఖరీదైన వైద్యం అందించడమే ఆరోగ్యశ్రీ లక్ష్యం: సీఎం జగన్

  • IndiaGlitz, [Monday,December 18 2023]

'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ.25 లక్షలకు పెంచే కార్యక్రమానికి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, సంబంధిత శాఖ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకూడదనే ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు.

కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డులు..

నేటి నుంచి కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుందని.. ఈ కార్డులో లబ్దిదారుడి ఫొటోతో పాటు ఇతర వివరాలను పొందుపరిచి క్యూ ఆర్ కోడ్‌తో రూపొందించినట్లు సీఎం చెప్పారు. పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో రాష్ట్రంలోని 2,513 ఆసుపత్రులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రులను కూడా ఎంప్యానెల్ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని... పార్లమెంట్‌ స్థానానికి ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.

ఏటా రూ.4,100 కోట్లకు పైగా ఖర్చు..

పేదవాడికి ఖరీదైన వైద్యం అందుబాటులోకి అందించడంతో పాటు చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలోనూ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. విశ్రాంతి కాలానికి ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ. 5వేల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు. ఇక గత ప్రభుత్వం క్యాన్సర్ వంటి భయానక రోగాల బారినపడిన పేదవారికి రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం క్యాన్సర్ బాధితుల చికిత్సకు ఎంతైనా సరే ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.4100 కోట్లకు పైగా ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆయన వెల్లడించారు. అలాగే ప్రతీ ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌లు ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కింద ఏయే అసుపత్రుల్లో ఏయే చికిత్సలు అందుతున్నాయని తెలిసేలా యాప్‌లో వివరాలు నమోదుచేయాలని సూచించారు.

More News

Bigg Boss Telugu 7 : హౌస్‌ను కనుసైగతో శాసించి.. చాణక్యుడిగా నిలిచి , బిగ్‌బాస్ చరిత్రలోనే శివాజీ రెమ్యూనరేషన్ ఓ రికార్డు

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు ట్రోఫీ ఎందుకు దూరమైంది.. రన్నరప్‌గా నిలిచినా వచ్చింది సున్నా

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్‌లు ఫైనలిస్టులుగా నిలవగా..

Chandrababu:చంద్రబాబును చెప్పుతో కొడతా.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిపెట్టాయి. టికెట్ రాదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థుల అనుచరులు

Amardeep: అన్నపూర్ణ వద్ద ఘర్షణ .. అమర్‌పై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి, ఆ లేడి కంటెస్టెంట్ కారు అద్దాలు ధ్వంసం

15 వారాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ 7 తెలుగు ముగిసింది. అందరిని షాక్‌కు గురిచేస్తూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి, బిగ్‌బాస్ చరిత్రలో

Chandrababu-Lokesh:అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్.. అక్కడే పాదయాత్ర ముగింపు..

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యాత్రను ముగించనున్నారు.