ఆర్నాల్డ్ ఒప్పుకోవడం లేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' ఎంతంటి సెన్సేషనల్ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా 'రోబో2'ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అమీజాక్సన్, విలన్ గా అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ నటిస్తారని వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి ఆర్నాల్డ్ 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.
అయితే ఈ ఇంత రెమ్యునరేషన్ తీసుకుని అడిగినన్ని రోజులు కాల్షీట్ మాత్రం ఇవ్వడం లేదట. వివరాల్లోకెళ్తే..శంకర్ రోబో2కోసం ఆర్నాల్డ్‌ను 50రోజులపాటు కాల్షీట్ అడిగితే తను 32 రోజుల కాల్షీట్‌ను మాత్రమే ఇచ్చాడట. అందుకు శంకర్ ఒప్పుకోలేదట. నిర్మాతలతో చర్చల అనంతరం ఆర్నాల్డ్ 36రోజుల కాల్షీట్ ఇస్తానన్నడట. కానీ శంకర్ కాంప్రమైజ్ కావడం లేదు. పోనీ మరెవరితోనైనా వెళదామని అన్నా కూడా వినడం లేదట. ఈ విషయం ఆర్నాల్డ్‌ను కలిసి అసలు 50రోజుల ఎందుకు కావాలనుకుంటున్నాడనే సంగతి వివరించడానికి శంకర్ అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆర్నాల్డ్ ఒప్పుకుంటే సరి..లేకుంటే శంకర్ సర్దుకుపోతాడా? లేక మరెవరితోనైనా కాంప్రమైజ్ అవుతాడా అని చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com