సైన్యం సాహసాలను రాజకీయాల కోసం వాడుకోవద్దు!

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

సైన్యం సాహసాలను రాజకీయాలకోసం వాడుకోవడం సరికాదని కేంద్ర ప్రభుత్వవానికి విపక్షాలు సూచించాయి. బుధవారం సాయంత్రం విపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ సహా 21 విపక్ష పార్టీలు హాజరయ్యాయి.

ఈ సందర్భంగా పాకిస్థాన్ మీద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్‌ను విపక్షాలు అభినందించాయి. సమావేశం ప్రారంభం కాగానే పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన అమర వీరులకు నివాళులు అర్పించడం జరిగింది. అయితే, సైన్యం సాహసాలను అధికార పార్టీ తమ రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని విపక్షాలన్నీ ఒక్కసారిగా కేంద్రానికి సూచించాయి.

రాజకీయాల కంటే జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కేంద్రానికి సూచించారు. తప్పిపోయిన పైలెట్ గురించి తాము ఆందోళన చెందుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

చంద్రబాబు ఏమన్నారంటే..

దేశ సమగ్రత కోసం ఎయిర్‌ఫోర్స్‌కు, రక్షణ రంగానికి సంఘీభావం తెలియజేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అదే సమయంలో ఈ వ్యవహారాలను రాజకీయాలకు వాడుకోకుండా ఉండడం అవసరమన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పైలెట్ విషయంలో ఆందోళన వ్యక్తం చేశామని... అతని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తీవ్రంగా ఖండించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

More News

త‌నుశ్రీ షార్ట్ ఫిలిం 'ఇన్‌స్పిరేష‌న్‌'

హాలీవుడ్‌లో మీ టూ ఉద్య‌మం జోరుగా సాగుతున్న స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ సెట్స్‌లో త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేశాడ‌ని మీడియా ముందు చెప్పి.. మీ టూ ఉద్య‌మానికి తెర తీసిన న‌టి త‌ను శ్రీ ద‌త్తా.

భారత్ పైలట్‌‌ను కొట్టి.. ఫొటోలు విడుదల చేసిన పాక్

భారత్‌‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని భద్రతాదళాల అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ బుధవారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

'మేజ‌ర్‌' అవుతున్న అడివిశేష్

ఇండియాలో ప్ర‌ముఖ నిర్మాణ‌, పంపిణీ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు

భారత్ పైలట్ తప్పిపోయిన మాట నిజమే..

భారత్ ఫైలట్ తప్పిపోయిన మాట నిజమేనని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అధికారులు.. పాక్ చెబుతున్న పచ్చి అబద్ధాలను అధికారులు తిప్పి కొట్టారు.

యుద్ధం మొదలైతే ఎక్కడికెళ్తుందో తెలీదు: పాక్ ప్రధాని

గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తోక ముడిచిన పాకిస్థాన్ తిక్క కుదిరినట్లుంది. అందుకే భారత్‌‌తో చర్చలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు.