సైన్యం సాహసాలను రాజకీయాల కోసం వాడుకోవద్దు!
Send us your feedback to audioarticles@vaarta.com
సైన్యం సాహసాలను రాజకీయాలకోసం వాడుకోవడం సరికాదని కేంద్ర ప్రభుత్వవానికి విపక్షాలు సూచించాయి. బుధవారం సాయంత్రం విపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ సహా 21 విపక్ష పార్టీలు హాజరయ్యాయి.
ఈ సందర్భంగా పాకిస్థాన్ మీద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్‌ను విపక్షాలు అభినందించాయి. సమావేశం ప్రారంభం కాగానే పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన అమర వీరులకు నివాళులు అర్పించడం జరిగింది. అయితే, సైన్యం సాహసాలను అధికార పార్టీ తమ రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని విపక్షాలన్నీ ఒక్కసారిగా కేంద్రానికి సూచించాయి.
రాజకీయాల కంటే జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కేంద్రానికి సూచించారు. తప్పిపోయిన పైలెట్ గురించి తాము ఆందోళన చెందుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
దేశ సమగ్రత కోసం ఎయిర్‌ఫోర్స్‌కు, రక్షణ రంగానికి సంఘీభావం తెలియజేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అదే సమయంలో ఈ వ్యవహారాలను రాజకీయాలకు వాడుకోకుండా ఉండడం అవసరమన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పైలెట్ విషయంలో ఆందోళన వ్యక్తం చేశామని... అతని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తీవ్రంగా ఖండించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout