ప్రభాస్ కి పాడాలని ఉందట‌

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

బాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ అర్మాన్ మాలిక్. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడారు. 2014లో వచ్చిన 'రౌడీ ఫెలో' మూవీలో 'ఏదో' అనే పాటను మొదటిసారిగా తెలుగులో హర్షిక‌తో కలిసి పాడారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'కాటమరాయుడు'(2017)లో 'ఏమో ఏమో' అనే పాటను శ్రేయాఘోషల్ తో కలిసి పాడారు.

తాజాగా.. శంకర్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన‌ '2.O' సినిమాలో కూడా ఒక పాటని పాడారు ఈ గాయకుడు. స్వతహాగా హైదరాబాదుతో అనుబంధం (అమ్మ జ్యోతి.. తెలుగు) ఉండడంతో.. తనకి టాలీవుడ్, హైదరాబాద్ రెండూ కూడా చాలా స్పెషల్ అని చెప్పారు. అలాగే తన మనసులో మాటను చెప్తూ, "నాకు తెలుగు సినిమాల్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది.

ప్రభాస్ సినిమాలో పాడాల‌ని ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు.. ప్ర‌భాస్ కి పాడే అవ‌కాశం రాలేదు. వ‌స్తే వ‌దులుకోలేను" అని అసలు విషయాన్ని బయట పెట్టారు. అనూప్ రూబెన్స్ రాబోయే సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని ఈ సింగర్ దక్కించుకున్నారు. అన్నట్టు 'కాటమరాయుడు' సినిమాకి కూడా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.

More News

'హ‌లో'.. మెరిసే మెరిసే పాట విశ్లేష‌ణ‌

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హలో'. అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.

విజ‌య్ దేవ‌రకొండ కొత్త మూవీ టైటిల్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యూత్ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌డు. పెళ్ళి చూపులు స‌క్సెస్ త‌ర్వాత విడుద‌లైన 'అర్జున్ రెడ్డి' సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు.

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. క్లాప్‌తో ప్రారంభమైన 'వాళ్లమ్మాయి'

'లవ్‌లీ' 'ఉయ్యాలా జంపాలా', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'బాహుబలి' వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్‌ దాదాపు యాభై చిత్రాలకు పైగా నటించాడు.

డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా '2 కంట్రీస్' విడుదల

"జై బోలో తెలంగాణా" లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా "2 కంట్రీస్"కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రం "2 కంట్రీస్".

సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో యేంటి రాజా యూత్ ఇలా ఉంది...

లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎమ్వీఎస్ సాయి క్రిష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం యేంటి రాజా యూత్ ఇలా ఉంది. దర్శకుడు ఆది శేష సాయి రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.