అర్జును ఫల్గుణ సెకండ్ సింగిల్ ‘కాపాడేవా? రాపాడేవా?’ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి అర్జున ఫల్గుణ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అర్జున ఫల్గుణ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాట అందరినీ ఆకట్టుకుంది. నేడు కాపాడేవా రాపాడేవా? అనే మరో పాటను విడుదల చేశారు. ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అద్భుతమైన బాణీని ఇచ్చారు.
ఈ పాటలో శ్రీ విష్ణు అతని స్నేహితులు, అమృతా అయ్యర్ అందరూ కనిపిస్తున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. మోహన భోగరాజు గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన రాగా.. ఈ రెండో పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు : శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com