'సర్కారు వారి పాట' నుంచి అర్జున్ అవుట్.. జగ్గూభాయ్ ఇన్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఇంటర్నెట్ ని బ్రేక్ చేసింది. ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత మహేష్ నుంచి మాస్ వైబ్స్ తో వస్తున్న చిత్రం ఇది.
మహేష్ కి జోడిగా ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తోంది. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేసింది. ఇదిలా ఉండగా సర్కారువారి పాటలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అర్జున్ కీలక పాత్రలో నటించాల్సింది. ఈ మేరకు అర్జున్ సైన్ కూడా చేశారు. త్వరలోనే అర్జున్ సర్కారు వారి పాట సెట్స్ లో జాయిన్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. ఇంతలోనే అర్జున్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. కారణాలు తెలియవు కానీ ఈ మూవీ నుంచి అర్జున్ వైదొలిగారట.
దీనితో చిత్ర యూనిట్ వేగంగా నిర్ణయం తీసుకుని మరో క్రేజీ నటుడిని ఎంపిక చేసుకుంది. అతడెవరో కాదు జగ్గూ భాయ్ జగపతి బాబు. జగపతి బాబు, మహేష్ లది హిట్ కాంబో అనే చెప్పాలి. శ్రీమంతుడు, మహర్షి చిత్రాలలో జగపతి బాబు నటించారు.
దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మహేష్ అభిమానులకు మాస్ ట్రీట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ మేకోవర్ ఎలా ఉందొ ఫస్ట్ లుక్ లో అందరూ గమనించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కానుంది. తమన్ సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments