Arjun Tendulkar:సచిన్ కొడుకుని కుక్క కరిచిందట.. గాయం చూపిస్తూ చెప్పిన అర్జున్ టెండూల్కర్, వీడియో వైరల్

  • IndiaGlitz, [Tuesday,May 16 2023]

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ గురించి చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్ధాల పాటు భారతీయులను, యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన ఆటతో అలరించారు. అయితే 2013లో ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో సచిన్ వారసత్వం మళ్లీ ఎప్పుడు క్రికెట్‌లో ఎంట్రీ ఇస్తుందోనని అంతా ఎదురుచూశారు. అందరూ ఊహించిన విధంగానే సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. తండ్రిలా బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా ఆల్‌రౌండర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. 2021 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అతడిని వేలంలో తీసుకుంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ వరకు అర్జున్ ప్రదర్శన చూసే అవకాశం అభిమానులకు రాలేదు. కానీ అర్జున్ టెండూల్కర్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. కానీ ప్రాక్టీస్ మాత్రం విడిచిపెట్టడం లేదు.

గాయాన్ని చూపిన అర్జున్ టెండూల్కర్ :

ఇదిలావుండగా.. అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచిందట. ఈ విషయాన్ని అతనే స్వయంగా తెలియజేశాడు. ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు లక్నో- ముంబైల మధ్య కీలక మ్యాజ్ జరగనుంది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా లక్నో ఆటగాడు యుధ్ వీర్‌తో మాట్లాడుతూ తన ఎడమ చేతిపై కుక్క కరిచిందని అర్జున్ టెండూల్కర్ చెప్పాడు. దీనికి యుధ్ వీర్ ఎప్పుడు అని అడగ్గా.. నిన్న అని సచిన్ కొడుకు చెప్పాడు. వీరిద్దరి సంభాషణను లక్నో జట్టు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది

ప్లే ఆఫ్ బెర్త్ కోసం లక్నో - ముంబై పోరు :

కాగా.. ఐపీఎల్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసి ప్లే ఆఫ్స్‌కు సమయం దగ్గరపడిన సంగతలి తెలిసిందే. టాప్ 4కు వెళ్లేందుకు కొన్ని జట్లకు మాత్రమే అర్హత వుంది. ఇప్పటికే గుజరాత్ అందరికంటే ముందే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మంగళవారం పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో వున్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా వుంచుకోవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలగా వున్నాయి.