యూత్ టార్గెట్ గా అర్జున్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడే సుబ్రమణ్యం ఫేం విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్, మంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, ఇటలీ లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నాగేష్ బాన్నెల్ సినిమాటోగ్రఫీ, రతన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న అర్జున్ రెడ్డి సినిమా కోసం ఏక్టింగ్ వర్క్ షాపు కూడా నిర్వహించారు. ఈ వర్క్ షాపులో హీరో విజయ్, హీరోయిన్ షాలినికి డైరెక్టర్ సందీప్ కిస్ సీన్ గురించి వివరించిన వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోలో కిస్ సీన్ రియలిస్టిక్ గా ఉండాలి...కృత్రిమంగా ఉండకూడదు అని డైరెక్టర్ చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే...యూత్ టార్గెట్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నారని తెలుస్తుంది. మరి...యూత్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments