తమిళంలో 'అర్జున్ రెడ్డి' టైటిల్ మారింది.
- IndiaGlitz, [Wednesday,February 20 2019]
తెలుగు సెన్సేషనల్ హిట్ అయిన విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాక హీరో మినహా అందరినీ మార్చేసి నిర్మాతలు మళ్లీ రీ షూట్ చేస్తున్నారు.
'అర్జున్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధ్రువ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ బనితా సంధు నటిస్తుంది. ముందు దీనికి 'వర్మ' అనే టైటిల్ను అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ టైటిల్ మారింది.
ఇప్పుడు 'ఆదిత్య వర్మ'గా మారింది. ప్రియా ఆనంద్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంది. 'అర్జున్ రెడ్డి' చిత్రానికి సంగీతం అందించిన రధన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.