'అర్జున్ రెడ్డి' దర్శకుడి రెండో చిత్రం అప్ డేట్స్...

  • IndiaGlitz, [Wednesday,January 03 2018]

అర్జున్ రెడ్డి' సినిమా ఎంత సంచలనమో.. సందీప్ రెడ్డి వంగ పేరు కూడా అంతే సంచలనం. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయారు సందీప్. ఈ మూవీ తర్వాత సదరు డైరెక్టరుతో సినిమాలను చేయించుకోవడానికి ప్ర‌ముఖ‌ నిర్మాతలు సైతం తపిస్తున్నారంటే...ఈ డైరెక్టర్ పనితనం గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. అటు నిర్మాతలే కాదు ఇటు ప్రేక్షకులు కూడా సందీప్ తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎటువంటి కథతో సంచలనం సృష్టిస్తాడోనని ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

అయితే సందీప్ ఇప్పటికే ఒక క్రైమ్ స్టోరీని సిద్ధం చేస్తున్నారని.. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో షూటింగ్ ప్రారంభిస్తారని తాజాగా కథనాలు వినిపిస్తున్నాయి. 2019లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సందీప్ నిశ్చయించారని సమాచారం. అన్న‌ట్టు.. అర్జున్ రెడ్డి హిందీ వెర్ష‌న్ కూడా సందీప్ ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొంద‌నుంది. ఇందులో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించ‌నున్నాడు. ఈ రీమేక్ త‌ర్వాతే సందీప్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఉంటుంది మ‌రి.

More News

'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల

'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల రామసత్యనారాయణ  భీమవరం టాకీస్ పై 92 వ చిత్రంగా 'బటర్ ప్లెయిస్'  చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె. R.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం.

'ఇంద్ర', 'అజ్ఞాతవాసి'.. కొన్ని కామన్ పాయింట్స్

కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా భలే సరదాగా,గమ్మత్తుగా ఉంటాయి.

మ‌ళ్ళీ దేవిశ్రీ ప్ర‌సాద్‌తోనే..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 19 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రాజ్‌ తరుణ్‌ 'రంగుల రాట్నం' ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది

2017లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది. రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు.

రచయిత రామస్వామి దర్శకత్వంలో 'మూడు పువ్వులు ఆరు కాయలు'!

`ప్రేమ గొప్పదే.. జీవిత లక్ష్యం ఇంకా గొప్పది.ప్రేమంటే చంపటమో చావటమో కాదు,చచ్చేదాకా కలిసి బ్రతకటం.